వెస్ట్ ఇండీస్ లో జరిగే దేశవాళీ లీగ్ అయిన మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు టీం ఇండియా మహిళా ప్లేయర్ శ్రేయాంక్ పాటిల్ బీసీసీఐ నుండి అనుమతిని పొందింది. ఈ లీగ్ ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. ఇందులో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడనుంది. అయితే ఇప్పటి వరకు విదేశీ లీగ్ లలో ఆడడానికి బీసీసీఐ కొందరికి మాత్రమే అనుమతిని ఇవ్వడం జరిగింది. వారిలో టీం ఇండియా మహిళల కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన్న, జెమీమా రోడ్రిగస్, దీప్తి శర్మ, రిచా ఘోష్ లు ఉన్నారు. వీరు ఇప్పటికే బిగ్ బాష్ లీగ్ , మహిళల 100 లీగ్ వంటి వాటిలో ఆడి ఉన్నారు. ఇక వీరి తర్వాత విదేశీ లీగ్ లు ఆడొచ్చని అనుమతి పొందిన వారిలో శ్రేయాంక్ పాటిల్ మొదటి స్థానంలో ఉంది.
మరి ఈ కరేబియన్ లీగ్ లో బాగా ఆడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ట్రోపీని అన్ధనిచాలని కోరుకుందాం.