ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

-

టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. రెండు వారాల క్రితం వరకు రూ.40కి అమ్ముడైన టమాటా ధర .. గత వారం రూ.70కి దూసుకెళ్లింది. ధర మరింత పెరిగి రూ.90 నుంచి రూ.100 వరకు చేరుకుంది. ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల రూ.120 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Why Tomato Prices Are On Its Peak? Explained | India News, Times Now

టమాటా ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే టమాటాలను 2023 జూలై 4 నుంచి రేషన్ షాపుల్లో రూ. 60కే అమ్మనున్నట్లుగా పేర్కొంది. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ చెన్నై, సెంట్రల్ చెన్నైగా విభజించి మొత్తం 82 రేషన్ షాపుల్లో కిలో రూ.60 చొప్పున టమాటాలను అమ్మనున్నట్లుగా మంత్రి కేఆర్ పెరియకురుప్పన్ వెల్లడించారు. త్వరలో ఇతర జిల్లాలకు కూడా దీనిని విస్తరిస్తామన్నారు.వినియోగదారులు, రైతులు నష్టపోకుండా ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పెరియకురుప్పన్ . దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగాయని, రైతుల నుంచి నేరుగా టమాటా కొనుగోలు చేసి మార్కెట్ ధరలో సగానికే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టమాటా ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లను పెంచిందని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news