జోడు గుర్రాల రేసు షురూ..కాషాయ జెండా ఎగరవేస్తారా?

-

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ..బి‌జే‌పి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓ వైపు కేంద్రంలో మళ్ళీ పాగా వేయాలని చూస్తూనే..ఇటు త్వరలోనే ఎన్నికలు జరగనున్న తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టారు. మొన్నటివరకు ఇక్కడ బి‌జే‌పి రేసులో ఉంది. కానీ కొంతకాలం నుంచి కాంగ్రెస్ నుంచి పుంజుకోవడం..బి‌జే‌పి వెనుకపడటం జరిగింది. అదే సమయంలో అంతర్గత పోరు మొదలైంది. తాజా మాజీ టి‌బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ తో కొందరు నేతలకు పోసాగలేదు.

ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ లాంటి వారు బండిపై గుర్రుగా ఉన్నారు. అలాగే బహిరంగంగానే బండిపై విమర్శలు చేశారు. అలాగే ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమైన బి‌జే‌పి..తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడుని సైతం మార్చేశారు. బండి సంజయ్‌ని తప్పించి..అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని పెట్టారు. బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఈటల రాజేందర్‌ని తెలంగాణ బి‌జే‌పి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.

అటు కిషన్, ఇటు ఈటల…ఇప్పుడు తెలంగాణలో రేసు మొదలుపెడుతున్నారు. వీరి ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది. బలమైన బి‌ఆర్‌ఎస్ తో పాటు బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలి. ఇది అంత ఈజీ టాస్క్. కానీ ఇద్దరు సీనియర్లు ఎలా బి‌జే‌పిని ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

అయితే గతంలో కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీలో బి‌జే‌పి అధ్యక్షుడుగా పనిచేశారు. పార్టీ కోసం కష్టపడ్డారు. సౌమ్యుడుగా ఉంటూ ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లగలరు. ఇటు ఈటలకు ఎన్నికల వ్యూహాలు, కే‌సి‌ఆర్ బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలుసు కాబట్టి…ఆయన కూడా ఎన్నికల కమిటీ ఛైర్మన్ పదవికి అర్హుడే. చూడాలి మరి వీరిద్దరి అధ్వర్యంలో తెలంగాణలో బి‌జే‌పి ఏ స్థాయికి వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news