అందుకే విజయ్‌ని ప్రేమించా.. ప్రియుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా

-

టాలీవుడ్​ వర్గాల్లో తమన్నా ప్రేమాయణం ఇటీవల హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమె మరోసారి తన ప్రియుడిపై ప్రశంసలు కురిపించింది. యంగ్​ జనరేషన్​లోనూ ఈ తరహా మార్పు రావాలి. అన్నింటిలోనూ మహిళలే రాజీపడాలనే కాన్సెప్ట్​ను నేను అంగీకరించను. ‘విజయ్​ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అదే నన్ను అతడితో ప్రేమలో పడేలా చేసింది’అంటూ తమన్నా తెలిపింది. ఇక హీరోలు శృంగార సీన్లు చేస్తే సూపర్​ స్టార్స్​ని చేస్తారని.. హీరోయిన్లను మాత్రం విమర్శిస్తారని తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది.

Vijay Varma says Tamannaah Bhatia's loyal fans annoy him | Entertainment  News,The Indian Express

సెట్‌లో ఎవరితో మీరు కంఫర్ట్‌గా ఉంటారు అనే ప్రశ్నకు తమన్నా సమాధానమిస్తూ.. ‘సౌత్ స్టార్స్ నాతో ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్, కింగ్ నాగార్జున కొడుకు నాగచైతన్యతో నేను వర్క్ చేశాను. వాళ్లు ఎంతో గౌరవంగా పెరిగారు. వారి ప్రవర్తన చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఉద్దేశ్యంలో శౌర్యం ఈ దేశంలో చాలా అరుదు. కానీ నేను టాలీవుడ్‌లో పనిచేసిన సమయంలో కొందరు పురుషుల్లో శౌర్యాన్ని గమనించాను. వారు చాలా ధైర్యవంతులు. సెట్‌లో ఉన్న నటీమణులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడంలో వారంతా మేటి. వారిలో చిరంజీవి ఒకరు’ అంటూ చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news