ఈనెల 20న తెలంగాణకు ప్రియాంక గాంధీ !

-

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఈనెల 14వ తేదీ లేదా 20వ తేదీన తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ తెలంగాణ పర్యటనలో భాగంగా… కొల్లాపూర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ఇక ఈ కొల్లాపూర్ బహిరంగ సభలో భాగంగా… ప్రియాంక గాంధీ మరియు మల్లికార్జున సమక్షంలో జూపల్లి కృష్ణారావు మరియు ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఇప్పటికే ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news