జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్

-

హైదరాబాద్ లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేగింది. సరూర్ నగర్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్ పరిశీలించడానికి జీఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్, మరికొంతమంది సిబ్బంది వెళ్లారు. అయితే వారు నకిలీ జీఎస్టీ నెంబర్ తో పన్నులు ఎగవేస్తున్నారని గుర్తించి గోడౌన్ సీజ్ చేయడానికి అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆ స్క్రాప్ గోడౌన్ యాజమాన్యం, సిబ్బంది జిఎస్టి అధికారులపై దాడికి దిగారు. నకిలీ జిఎస్టి అధికారులు అంటూ వారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి వారి ఫోన్లను ట్రాక్ చేశారు. ఈ ముఠాకి చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. మంత్రి, డీజీపీ, సిపితో ఫోన్లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు నిర్మల సీతారామన్. కిడ్నాప్ చేసిన వారిలో సయ్యద్ ఫిరోజ్, ముజీబ్, ఇంతియాజ్, ముషీర్ అనే స్క్రాప్ వ్యాపారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news