ఏపీ ప్రజలకు శుభవార్త.. 23 రకాల పనులతో వర్షాకాలంలోనూ ఉపాధి

-

ఏపీ ప్రజలకు శుభవార్త.. 23 రకాల పనులతో వర్షాకాలంలోనూ ఉపాధి పనులు నిర్వహించాలని జగన్‌ సర్కార్‌ ఆలోచన చేస్తోంది. వర్షాకాలంలోనూ గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మురుగు/వరద నీరు మళ్లింపు కాలువల తవ్వకం, బ్రిడ్జిలు, పైపు కల్వర్టుల పూడికతీత, రోడ్లు, నీటిపారుదల కాలువ వెంబడి మొక్కలు నాటడం, కొండలపై నుంచి పారే వర్షపు నీరు నిల్వకు వీలుగా ట్రెంచ్ ల నిర్మాణం వంటి 23 రకాల పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ గుర్తించింది. ఇప్పటికే అనుమతి ఉన్న పనులతో పాటు ఈ పనులను కూలీలకు అప్పగిస్తారు.

కాగా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీల పెండింగ్ వేతనాలకు సంబంధించి అధికారులు స్పందించారు. 5 వారాలుగా చెల్లింపులు నిలిచిపోగా… త్వరలోనే ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాల్లో పెండింగ్ వేతనాలు జమ చేస్తామని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెల్లింపులు ప్రారంభమయ్యాయని… త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ జమ అవుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news