తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో 3 రోజుల పాటు వర్షాలు

-

తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్..మరో 3 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న ప్రకటించారు.

అటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలుచోట్ల రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్థాయని తెలిపింది. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news