రికార్డుల వేట మొదలు పెట్టేన ప్రభాస్‌..

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డుల వేట మొదలు పెట్టేశాడు. సలార్ దెబ్బకు యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. జులై 6 ఉదయం 5:12 నిమిషాలకు రిలీజైన ఈ టీజర్ కు దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
దీంతో.. ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. టీజర్ రిలీజైన కేవలం 12 గంటల్లోనే 45 మిలియన్ వ్యూస్, 1.4M లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. నిమిష నిమిషానికి ఈ కౌంట్ పెరుగుతూనే ఉంది. #1ట్రెండింగ్ లో ఉన్న సలార్ టీజర్ భయంకరమైన వ్యూస్ పెరుగుతూ వస్తోంది.

Salaar Teaser Storm: 45 Million Views in 12 hours

ఈ సినిమాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంబంధం ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోచ్చిందని తెలుస్తోంది.. మరో వారంలో కంప్లీట్ కానుందని సమాచారం. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుంది. మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news