ఫలక్ నుమా రైలు ప్రమాద ఘటనలో ఏడు బోగీలు దగ్ధమైనట్లు ఎస్సీఆర్ జిఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఇందులో మూడు భోగీలు పూర్తిగా దగ్ధం అవ్వగా.. మరో నాలుగు పాక్షికంగా దహనం అయ్యాయని తెలిపారు. మొత్తం 18 భోగీలలో ఏడు ఘటనస్థలిలో ఉంచి మిగతా 11 కోచ్ లను సికింద్రాబాద్ తరలిస్తున్నామని తెలిపారు. ఇక దగ్ధమైన భోగిలలోని ప్రయాణికులను ఆరు బస్సుల ద్వారా తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
ట్రాక్ క్లియర్ చేయడానికి సాయంత్రం కావచ్చు అని తెలుస్తోంది. ఇక ఘటనా స్థలాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ రైలు ప్రమాదంతో పలు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. రామన్నపేటలో శబరి ఎక్స్ప్రెస్, నడికుడిలో రేపల్లె రైలును నిలిపివేశారు.