టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం : చంద్రబాబు

-

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వారాహితో యాత్ర చేస్తుంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రోడ్‌ షోలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ముస్లిం, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు.. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌కు ఎవరూ ఓటు వేయరన్నారు.. జగన్‌కు పులివెందులలో ఓటమి ఖాయమన్న ఆయన.. నాలుగేళ్ల నరకాన్ని అనుభవిస్తున్నాం.. రాచమల్లు ప్రొద్దుటూరు బకాసురుడు అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడు. మట్కా నిర్వహణ.. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటు.. ఒకప్పుడు మామూలు కౌన్సిలర్‌గా కూడా గెలవలేని వ్యక్తి.

Chandrababu: వైసీపీ పాలనలో అరాచకాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్‌ |  Chandrababu released another video on YCP GOVT RVRAJU

ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడంటూ ఫైర్‌ అయ్యారు. పేదలపై రూ. 51 వేల కోట్ల మేర విద్యుత్ భారం వేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.. టమాట రూ. 200కు చేరింది. నిత్యావసర ధరలు పెరిగాయి. టీడీపీ హయాంలో ధరలు పెరిగితే నియంత్రించాం అన్నారు. ఉల్లిపాయ ధరలు పెరిగితే నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెప్పించి ధరలను కంట్రోల్ చేశాను. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగనే అంటూ మండిపడ్డారు. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తామన్న ఆయన.. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. ముగ్గురు పిల్లలుంటే రూ. 45 వేలు.. నలుగురు పిల్లలుంటే రూ. 60 వేలు ఇస్తామని పేర్కొన్నారు చంద్రబాబు.ఈ ప్రభుత్వంలో జాబ్ గ్యారెంటీ లేదు.. ఫిష్ మార్కెట్ పెట్టి ఉద్యోగాలు తెచ్చాననే సీఎం జగనే అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.. మేం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ఆయన.. పరిశ్రమలు.. పెట్టుబడులు తెస్తాం. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news