తెలంగాణలో బీజేపీ జెండా ఎగురేస్తామని హుజురాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో విజయ సంకల్ప సభ జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ ను గద్దె దించేందుకు కేంద్ర పార్టీ సహకారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
BRS పార్టీని దించేది బీజేపీ ఇప్పటికే ఆలస్యం జరిగిందని.. కొన్ని మీడియా లు విష ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. BRS – బీజేపీ ఎప్పుడు ఒకటి కాదన్నారు. కాంగ్రెస్ , BRS ల మధ్య లోపాయి కర ఒప్పందం అని విమర్శలు చేశారు. అధికారం లోకి వచ్చేది బీజేపీ, ఇక్కడ ఎగిరేది కాషాయ జండా అన్నారు ఈటల రాజేందర్.