కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ లకు అడ్రస్‌ లేకుండా చేయాలి – ప్రధాని మోడీ

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ లకు అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు దేశ ప్రధాని మోడీ. వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీలో విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ట్రైలర్‌ చూపించామని గుర్తు చేశారు ప్రధాని మోడీ.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ లకు అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందని… నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌తో తెలంగాణకు ఎంతో ప్రయోజనం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ వరంగల్‌ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగానే కాజీపేటలో వ్యాగన్‌ తయారీ యూనిట్‌ అన్నారు ప్రధాని మోడీ. గత 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతుందన్నారు ప్రధాని మోడీ. కేసీఆర్‌ సర్కార్‌.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశంన చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news