తెలుగు బుల్లితెర పాపులర్ బిగ్ బాస్ క్లైమాక్స్ దశకు వచ్చే సరికి ఆసక్తికరంగా మారిపోయింది. అంచనాలు తలకిందుల అవుతున్నాయి. ప్రాణాలకు తెగించి మరి హౌస్ మేట్స్ చేస్తున్న పోరాటాలు ఆకట్టుకుంటున్నాయి. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒకరికి డైరెక్టుగా బిగ్ బాస్ ఫినాలే టికెట్ ఛాన్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కొంత పర్సంటేజ్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ ఇచ్చి తర్వాత టాస్క్ ల్లో గెలవడం ద్వారా వాళ్ళు దానిని రీఫిల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు.
ఇందులో ఆలీ అందరికంటే ఎక్కువగా 70 శాతం బ్యాటరీ చార్జ్ తో అందరికంటే టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన తొలి టాస్క్ లో గెలవడం ద్వారా ఆలీ సులువుగానే ఫినాలే టికెట్ సొంతం చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. ఇక రెండో టాస్క్ లోనూ భాస్కర్ ను ఓడించి ఫినాలేకు వెళతాడని అందరూ అనుకుంటే అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆలీ దూకుడైన ఆటతో బిగ్ బాస్ ఆగ్రహానికి గురవడంతో ఈవారం డైరెక్ట్ గా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యాడు.
ఇక రాహుల్ చాలా నిదానంగా ఫినాలే టికెట్ తీసుకుపోయాడు. మంగళవారం టాస్క్ లో ఆలీ బాబా భాస్కర్ పై బలప్రయోగం చేయడంతో బాబా భాస్కర్ ఆమడ దూరంలో పడిపోయాడు. బిగ్ బాస్ ఒకసారి వార్నింగ్ ఇచ్చిన ఆలీ రెచ్చిపోవడంతో బిగ్ బాస్ టాస్క్ రద్దుచేసి టికెట్ టు ఫినాలే నుంచి ఆలీని బయటకు పంపించేశాడు. ఆ గేమ్ లో గెలిచి ఉంటే అలీ నేరుగా ఫినాలే టికెట్ సొంతం చేసుకునేవాడు.
మరోవైపు చాలా కూల్ గా ఆడిన రాహుల్ డైరెక్టుగా ఫైనల్ ఛాన్స్ కొట్టేశాడు. మొత్తమ్మీద క్లైమాక్స్ వేడి బిగ్ బాస్ హౌస్ లో బాగానే రాజుకుంది. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ లు ఇచ్చి హౌస్ మేట్స్ ని రెచ్చ కొడుతున్నాడు. కానీ, ఆలీ తప్ప అందరూ కూల్ గానే ఆడుతున్నారు. అందుకే ఆలీ తగిన మూల్యం చెల్లించుకున్నాడు.