భారత్‌లోని ఐఫోన్ ప్రియులకు ఆపిల్ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇకపై ఆ కంపెనీకి చెందిన ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే చెన్నై సమీపంలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్ లో ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభం కాగా ప్రస్తుతం మేడిన్ ఇన్ ఇండియా ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ ఇక భారత్‌లోనే ఉత్పత్తి అవుతుండడంతో ప్రస్తుతం ఈ ఫోన్ ధర తగ్గింది.
ఈ క్రమంలో ఈ ఫోన్‌ను తగ్గింపు ధరలకే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్‌కు చెందిన 64జీబీ వేరియెంట్ ధర ప్రస్తుతం రిటెయిల్ మార్కెట్‌లో రూ.49,900 ఉండగా, ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో దీపావళి సేల్స్ సందర్భంగా ఈ వేరియెంట్‌ను రూ.44,900 కే విక్రయిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన మిగిలిన వేరియెంట్ల ధరలు కూడా తగ్గాయి.