చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా కిడ్నీలో రాళ్లు చేరడం వంటివి చాలా మందిలో కలుగుతున్నాయి. కిడ్నీలో రాళ్లు చేరడం వలన ఇబ్బంది పడాలి. కిడ్నీలో రాళ్లు కరిగించుకోవడానికి ఈ ఆహార పదార్థాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆహార పదార్థాలతో కిడ్నీలో రాళ్లు కరిగించుకోండి. రోజుకి 6 నుండి 8 గ్లాసులు వరకు నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు సులభంగా కరుగుతాయి. దానిమ్మ రసం, నిమ్మరసం, సూప్ లాంటి లిక్విడ్ ఫుడ్స్ ని తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయట పడొచ్చు.
వీటిని తీసుకోవడం వలన చిన్న రాళ్ళు బయటికి వచ్చేస్తాయి. అలానే రాళ్లు పెరగవు. తులసి టీ తీసుకోవడం వలన కూడా కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు కిడ్నీలో రాళ్లు తులసి టీతో కరిగిపోతాయి. క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్ల బాధ ఉండదు.
ఆపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్ల బాధ ఉండదు. కిడ్నీ రాళ్లతో బాధపడే వాళ్ళు గోధుమ గడ్డ రసం తీసుకుంటే కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గోధుమ గడ్డలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మూత్ర నాణంలో క్యాల్షియం నిలవలని తొలగించడానికి గోధుమ గడ్డి జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే వీటిని అనుసరించండి అప్పుడు ఏ ప్రమాదం ఉండదు.