జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండవ వారాహి యాత్రలో భాగంగా నిన్న ఏలూరు నుండి మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జగన్ ప్రభుత్వం చేయాల్సిన పనులను గుర్తు చేస్తోంది. తాజాగా ఏలూరు లోని ఒక ప్రధానమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. జనసేన నేతలు ఏలూరులోని ప్రభుత్వ కళాశాలలో సరైన భవనం లేకుండా ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ను గురించి తెలియచేశారు. ఇక్కడ స్టూడెంట్స్ చెట్ల కిందనే చదువుకుంటూ ఉండడం చూసి జగన్ మారాలి అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో మేము ఇన్ని పధకాలు ఇస్తున్నాం అంటూ మాటలు చెప్పుకోవడం కాదు. చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడే కాలేజీలు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు జనసేన నేతలు. ఈ కాలేజీ లో మొత్తం 300 మంది విద్యార్థులు చదువుతున్నారు, జగన్ బటన్ నొక్కి వీరికి భవనం కట్టించు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలపైన ప్రభుత్వం నుండి కానీ , లేదా వైసీపీ నుండి కానీ ఎవరైనా స్పందిస్తారా చూడాలి.