కేటీఆర్ బిల్డర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు – మాజీ ఎమ్మెల్యే చింతల

-

మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. లక్ష కోట్లు హైదరబాద్ అభివృద్ది కోసం ఖర్చు పెట్టామని ట్విట్టర్ మాస్టర్ కేటీఆర్ చెబుతున్నారని.. కానీ చిన్న వర్షం పడిన హైదరాబాద్ మునుగుతుందని మండిపడ్డారు. 20 లక్షల మందికి సరిగా తాగు నీరు అందడం లేదన్నారు. కల్వకుంట్ల టాక్స్ కె 30% పోతే అభివృద్ధి ఎక్కడ సాధ్యమవుతుందన్నారు. పూణె, అహ్మదాబాద్ లలతో పోల్చుకుంటే జిహెచ్ఎంసి బడ్జెట్ తక్కువన్నారు.

అవి విస్తీర్ణం , జనాభా లో జిహెచ్ఎంసి కన్నా తక్కువ అన్నారు. మేహిదిపట్నం నుండి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో ఏమైంది..? అని ప్రశ్నించారు చింతల. వ్యాపార లావాదేవీలు తప్ప హైదరాబాద్ అభివృద్దికి కేటీఆర్ చేసింది ఏం లేదన్నారు. కేటీఆర్ వి అన్ని అబద్ధపు, బూటకపు మాటలన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అబద్ధాలు చెపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేయలేదని.. కేటీఆర్ బిల్డర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news