కష్టమర్లకు చెప్పకుండా ఖాతాల్లోంచి డబ్బులు కట్‌ చేస్తున్న బ్యాంకులు..స్టెట్‌మెంట్‌ చెక్ చేసుకున్నారా..?

-

బ్యాంకు లావాదేవీలు ఎప్పుడూ కన్ఫ్యూజ్‌గానే ఉంటాయి. మన అకౌంట్‌లో ఉండేదే అంతంతమాత్రం డబ్బు.. ఒక్కోక్కసారి మనకు తెలియకుండా 50,20 100 ఇలా అమౌంట్‌ కట్‌ అవుతుంది. మనం చిన్న అమౌంటే కదా లైట్ తీసుకుంటాం. మీరు అసలు నెల నెల మీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ చూసుకుంటున్నారా..? ఏ అమౌంట్‌ ఎందుకు కట్‌ అవుతుందో తెలుసుకోవాలి. మీ మధ్య బ్యాంకులు కష్టమర్ల అనుమతి లేకుండా వాళ్ల ఖాతాల్లో డబ్బు తీసేస్తున్నారట.. మీరు మీ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి.

Phone Hack Drains German Bank Accounts | PCMag

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ఇన్స్యూరెన్స్ పథకాలను ప్రారంభించింది. మీ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ ఇన్స్యూరెన్స్ పాలసీల్లో ఉన్నవారు ఈ రెండు పథకాలకు మొత్తం కలిపి రూ.456 ఏటా చెల్లించాలి. ఈ స్కీమ్స్‌లో గతంలో ఎన్‌రోల్ అయినవారి అకౌంట్ల నుంచి ప్రతీ ఏటా ఆటో డెబిట్ ఆప్షన్‌తో ప్రీమియం డబ్బుల్ని కట్ చేస్తుంటాయి బ్యాంకులు.

ఈ రెండు స్కీమ్స్‌లో ఉన్నవారి అకౌంట్ల నుంచి బ్యాంకులు ఇప్పటికే ప్రీమియం డబ్బుల్ని కట్ చేశాయి. అయితే తాము ఈ స్కీమ్‌లో లేకపోయినా బ్యాంకులు తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేశాయని కొందరు కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారు. తాము ఏ స్కీమ్‌లో చేరలేదని, అయినా బ్యాంకులు తమ ప్రమేయం లేకుండా, తమ అనుమతి తీసుకోకుండా డబ్బులు కట్ చేస్తున్నాయని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి ఇప్పుడే కాదు. గతేడాది కూడా తలెత్తింది. ప్రముఖ బ్యాంకులు కస్టమర్ల ప్రమేయం లేకుండా, కస్టమర్ల అనుమతి తీసుకోకుండా, అసలు ఈ ఇన్స్యూరెన్స్ పథకాలకు డబ్బులు కట్ చేస్తున్నాయని చెప్పకుండా ప్రీమియం వసూలు చేసినట్టు గతేడాది కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది.

మీరు కూడా ఓసారి మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయండి. మీరు ఈ ఇన్స్యూరెన్స్ పథకాల్లో లేకపోయినా, మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయేమో గమనించండి. ఒకవేళ మీకు రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్టైతే, ఒక అకౌంట్‌లో ఈ స్కీమ్‌లో ఎన్‌రోల్ చేసినట్టైతే అందులో డబ్బులు కట్ అయి ఉంటాయి. కానీ రెండో అకౌంట్ నుంచి కూడా ప్రీమియం డబ్బులు కట్ అయితే బ్యాంకులో ఫిర్యాదు చేయండి. ఈ స్కీమ్‌ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ మనం జాయిన్‌ అవ్వకుండానే ఇలా డబ్బులు కట్‌ అవడం వల్ల మీకు పైసల్‌ పోవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.!

Read more RELATED
Recommended to you

Latest news