60 ఏళ్లలో కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలే : మంత్రి ఎర్రబెల్లి

-

కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాల‌న‌లో సాగునీరు కాదు క‌దా, క‌నీసం తాగేందుకు కూడా నీళ్లు లేని దుస్థితి. క‌రెంటు క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావని పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై రేవంత్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ పాల‌కుర్తిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

 

Foundation for Sevalal Bhavan in Palakurthy on February 26: Errabelli -  Telangana Todayరేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించ‌క‌పోవ‌డం కాంగ్రెస్ వైఖ‌రికి నిద‌ర్శన‌మ‌న్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్లే అన్నారు. ఆ పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌న్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం గతంలో లేదని, ఇక ముందు రాదన్నారు. కేసీఆర్ నిర్ణయాల కారణంగా తెలంగాణలో భూముల రేట్లు భారీగా పెరిగాయన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news