కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావును కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
అయితే.. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కిషన్ రెడ్డి… కేంద్ర మంత్రిగా అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్ రూంలు చూడవచ్చు అన్నారు. కానీ కిషన్ రెడ్డి …ఎందుకు ఈ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడో అర్థం కావట్లేదని ఆగ్రహించారు. నాతో వస్తే అంటే.. కిషన్ రెడ్డిని కొల్లూరు తీసుకుని పోయి చూపిస్తానని తలసాని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వము ఒక్క ఇంటికి… కేవలం లక్ష యాబై రూపాయలు మాత్రమే ఇస్తుందని… గ్రేటర్ లో డబుల్ బెడ్ రూం లను మూడు ఫేస్ లలో పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం ఏమి చేసింది తెలంగాణకు ? మేము కట్టిన ఇళ్ల దగ్గర బిజెపి నేతల తాపత్రయం ఎందుకు ? అంటూ ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.