స్మితా సబర్వాల్ కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కౌంటర్‌

-

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ సీఎంవో ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్.. ఇటీవల వివిధ వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటనపై రియాక్ట్ అవుతూ ఓ ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

Smita Sabharwal : స్మితా సబర్వాల్‌కు MLA రఘునందన్ రావు కౌంటర్ | Smita  Sabharwal

నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్​ రక్తం వచ్చేలా దాడి చేశారు. దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్​ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే సంఘటనపై సత్వరమే స్పందించి ట్వీట్లు పెట్టే మీరు బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై కూడా సత్వరమే స్పందించాలని కోరుకుంటున్నాం అని ఆయన ట్వీట్​ చేశారు. దీనపై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఎందుకని సెలెక్టివ్​గా ఆలోచిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలపై స్మితా సబర్వాల్​ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news