ఓట్ల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు : రఘునందన్‌ రావు

-

ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. సోమవారం డబుల్ బెడ్ రూం ఇండ్లని పేద ప్రజలకు ఇవ్వాలని చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందర్‌రావు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకి అన్యాయం చేసిందన్నారు. దళితబంధు కామారెడ్డి జిల్లాలో ఎంత మందికి ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Raghunandan Rao Made Sensational Comments; May To Quit BJP! | INDToday

ఓట్ల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారని, కానీ అవి అమలు కావడం లేదని ఆరోపించారు. కులవృత్తుల వారికి రూ.1 లక్ష సాయం చేస్తే దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు బీఆర్ఎస్ వారే ఉంటారన్నారు. తియ్యటి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ ఆగస్ట్ 30 నాటికి నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించకపోతే బీజేపీ తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తుందన్నారు. ఉధ్యమం ద్వారా కట్టిన ఇళ్లలోకి నిరుపేదలను పంపిస్తామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news