చేరికలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీ- కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగలింది. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. కేసీఆర్ అనిల్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుతో విసుగు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే..దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఒక టాస్క్ కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. తనకంటే ముందు ఎందరో సీఎంలు పనిచేశారు కానీ తాము ఒక టాస్క్ లా పని చేశామన్నారు.
అవమానాలు,అవహేళనలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. పదేండ్ల క్రితం తెలంగాణ గోస వర్ణనాతీతమన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు రోడ్డుకు ఇరువైపులా ధాన్యపురాశులే కన్పిస్తున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్ లా పనిచేశామన్నారు కేసీఆర్. గతంలో ఎంతో మంది సీఎంలు పనిచేశారు కానీ..ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని చెప్పారు.