బ్రో వింటేజ్ ర్యాప్ సాంగ్​కు.. పవర్ స్టార్ స్టెప్పులు.. వీడియో వైరల్

-

మరో రెండ్రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్​ను షేకాడించడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్​తో కలిసి బ్రో సినిమాతో వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమాలో కొన్ని సీన్లలో పవన్ వింటేజ్ లుక్స్​లో కనిపించనున్నాడని ఇప్పటికే మూవీ టీమ్ చెప్పేసింది. దీనికోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా చిత్రబృందం ఓ క్రేజీ వీడియోను రిలీజ్ చేసింది. పవన్ వింటేజ్​​ సూపర్ హిట్​ సాంగ్స్​.. గుడుంబా శంకర్ సినిమాలోని ‘కిల్లి కిల్లి’ సాంగ్​తో పాటు ‘వయ్యారి భామ’, ‘ఏదోలా ఉందీవేళ’, ‘సరిగమ పదనిస’ వంటి హిట్ పాటలను మిక్స్ చేసిన ప్రోమోను విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్.. వింటేజ్ కూలీ లుక్​లో లుంగీ, ఎర్రచొక్కా వేసుకుని మాస్ స్టెప్పులతో రప్ఫాడించాడు. ఈ పాటలో .. పవన్​తో పాటు సాయితేజ్​, తమన్​ వేసిన మాస్​ స్టెప్పులు కూడా ఫ్యాన్స్​ను ఊర్రూతలూగిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news