కిషన్ రెడ్డితో భేటీపై మందకృష్ణ మాదిగ క్లారిటీ

-

నేడు మందకృష్ణ మాదిగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. నాంపల్లి లోని రాష్ట్ర కార్యాలయానికి మందకృష్ణ మాదిగ వచ్చారు. ఈ నేపధ్యం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన కిషన్ రెడ్డిని అభినందించేందుకు మాత్రమే తాను పార్టీ కార్యాలయానికి వచ్చినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.

Manda Krishna Madiga urges TDP to make resolution on SC Sub classification

అందుకే అందుబాటులో ఉన్న పలు ఎస్సీ సంఘాల నేతలతో కిషన్ రెడ్డిని కలిసినట్లుగా వ్యక్తపరిచారు మంద కృష్ణ. తమది రెండున్నర దశాబ్ధాల అనుబంధమని ఆయన వెల్లడించారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు మంద కృష్ణ. కాగా మందకృష్ణతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news