ఒక్క టమాటా రూ.20.. ధర చూస్తుంటే గుండె గుబేలు

-

టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు ధరలు అకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక్క టమాట రూ.20 ఉంది.  మొన్నటి వరకు కిలో టమాటా ధర రూ.100 ఉండగా, బుధవారం రైతుబజార్‌లో ఏకంగా రూ.200లకు చేరుకుంది. కిలో టమాటా కొనుగోలు చేస్తే 10 నుంచి 12 వరకు వస్తున్నాయి. ఈ లెక్కన ఒక్కో టమాటా ధర రూ.20 పలుకుతోంది. కూరగాయల్లో తక్కువ ధరతో లభించడంతో పాటు, ఏ కూరలోనైనా.. రుచి కోసం టమాటాను వినియోగిస్తారు. అలాంటిది పెరిగిన ధరలతో వారంలో ఒకటి, రెండింటిని మాత్రమే వాడే పరిస్థితి నెలకొంది.

వానాకాలం సీజన్‌ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు గ్రామాల నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటారు. ఈ సీజన్‌లో సాగు తక్కువగా ఉండటం, అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాటాకు కొరత ఏర్పడింది. ఒక్కసారిగా దేశం మొత్తంలో డిమాండ్‌ ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగాయి. మాటాకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంత మంది వ్యాపారులు సిండికేట్‌గా మారి సొమ్ము చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news