మద్యం తాగే అలవాటు ఉంటే.. అందులోని బ్రాండ్స్ గురించి వెరైటీస్ గురించి తెలిసి ఉంటుంది. బీజర్ నుంచి మొదలై వైన్, విస్కీ, స్కాచ్, వోడ్కా, రమ్ము ఇలా మందులో ఉన్న రకాలు అన్నీ టేస్ట్ చేస్తారు. అయితే చాలామందికి వైన్ అంటే నచ్చుతుంది. వోడ్కా, స్కాచ్ ఇలాంటివి తాగినప్పుడు కిక్ బానే ఎక్కుతుంది కానీ.. ఆ ఎఫెక్ట్ మరుసటి రోజు వరకూ ఉంటుంది. హ్యాంగోవర్ అంత త్వరగా వదలదు. అదే వైన్ అయితే కిక్కు ఎక్కుతుంది. కడుపు మంట ఉండదు. ఎలాంటి తలనొప్పి ఉండదు. అన్నింటికంటే హైలెట్ వైన్ తాగితే..కలర్ వస్తారు, హెల్త్‌కు కూడా మంచిది. రెడ్, వైట్ కలర్లో ఉండే వైన్ చూస్తూనే ఉంటారు. కానీ ఈ నీలం రంగు వైన్ గురించి తెలుసా..? అసలు ఈ కలర్ ఎలా వస్తుంది..? బ్లూ వైన్ తాగడం హెల్తీ ఏనా..?
బ్లూ వైన్ 2016 నాటిది. స్పానిష్ బృందం వైన్ రంగు మీద ప్రయోగాలు చేయాలని కొన్ని నిబంధనలు ఉల్లంఘించి దీన్ని సృష్టించారు. యువతరాన్ని ఆకర్షించేందుకు ఈ సంప్రాదాయేతర పానియాన్ని రూపొందించడానికి ప్రయత్నించారు. బ్లూ కలర్ ద్రాక్షతో తయారు చేయడం వల్ల దీనికి ఈ రంగు వచ్చిందని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ వైన్ రంగు కోసం ఉపయోగించే ద్రాక్ష దగ్గర నుంచి ప్రతీ ఒక్క విషయం ఆశ్చర్యం కలిగించేదే.
దీని కోసం తెల్ల ద్రాక్షని ఉపయోగిస్తారు. ఈ ద్రాక్షని ప్రత్యేకమైన మెసేరేషన్ టెక్నిక్ ద్వారా రంగు తెప్పిస్తారు. ఈ టెక్నిక్ ద్రాక్ష రసాన్ని ఆంథోసైనిన్ అనే ఎర్ర ద్రాక్షతో కలిపుతారు. దీని వల్ల ఈ వైన్‌కి నీలం రంగు వస్తుంది. వైన్ బ్లూ కలర్ రావడంలో ఆంథోసైనిన్ కీలక పాత్ర పోషించింది. మెసేరేషన్ ప్రక్రియలో అన్ని ద్రవాలని ఒకే విధమైన కొలతతో తీసుకున్నారు. అయితే ఈ వైన్ కోసం ఎటువంటి కృత్రిమ రంగులు ఉపయోగించరు. దీనికి వచ్చిన నీలం రంగు పూర్తిగా సహజ వనరుల నుంచే వస్తుందట.
ఆంథోసైనిన్ వైన్ రుచిపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రధానంగా తెల్ల ద్రాక్ష అసలు రుచి, ప్రొఫైల్‌ని కలిగి ఉంటుంది. అందుకే ఈ వైన్ రీఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎలాంటి హానీ చేయదు.
పెద్ద పెద్ద పార్టీలో బ్లూ వైన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. డిఫరెంట్ స్టైల్ కోరుకునే వాళ్ళు దీన్ని తాగేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బ్లూ వైన్‌ని తరచుగా వైట్ వైన్ లేదా ఫ్రూటీ కాక్టెయిల్తో పోలుస్తారు.