కేంద్రంపై విపక్ష పార్టీల అవిశ్వాసం.. చర్చకు తేదీలు ఖరారు

-

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియాలోని కొన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చకు  తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో.. పార్లమెంట్‌లో చర్చించనున్నారు. ఈ మేరకు మూడురోజుల పాటు చర్చించాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై సమాధానం ఇవ్వనున్నారుని తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ను జాతుల మధ్య వైరం అట్టుడికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరగాలని.. ముఖ్యంగా మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన జారీ చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి.

మరోవైపు ఇవాళ కూడా పార్లమెంట్ ఉభయ సభలను మణిపుర్ వ్యవహారం అట్టుడికించింది. ఈ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news