ప్రేమించిన వాడి కోసం అలాంటి పని చేసి షాక్ ఇచ్చిన హీరోయిన్స్ వీళ్ళే..!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ముందే సెలబ్రిటీల మధ్య ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఏ విధంగా చిగురిస్తుందో చెప్పడం కష్టం. అయితే ఈ ప్రేమ అనేది కొంతకాలమే కొనసాగుతుంది… మరి కొంతమందికి అందరినీ దూరం చేసేలా చేస్తుంది. అయితే కొంతమంది తల్లిదండ్రులు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తే మరి కొంతమంది తల్లిదండ్రులు అంగీకరించరు. ముఖ్యంగా సెలబ్రిటీలైనా సరే ఇది వర్తించక మానదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తమ మనసుకు నచ్చిన వారిని అందులోనూ డైరెక్టర్ లను ప్రేమించి.. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే అతడి కోసమే కుటుంబాన్ని వదిలి పెళ్లి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు వారిలో కొద్ది మంది గురించి ఇప్పుడు చూద్దాం.

ఖుష్బూ:

ముందుగా హీరో ప్రభుతో పీకల్లోకి వరకు ప్రేమలో మునిగి తేలింది. చివరికి ఒంటరి అయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ పి.సుందర్ ను ఇష్టపడి 2000 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లికి ఆమె ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా సరే ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది.

రోజా:

రోజా ప్రేమ పెళ్లి మరి సినిమాటిక్ అని చెప్పాలి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2002లో సింపుల్ గా వివాహం చేసుకున్నారు. మొదట వీరి పెళ్లి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు కానీ ఆ తర్వాత అంతా కలిసిపోయారు.

శోభ:
అప్పటి క్లాసిక్ హీరోయిన్ శోభ సీనియర్ టాప్ మోస్ట్ డైరెక్టర్ బాలు మహేంద్ర తో ప్రేమలో పడి అందరిని ఎదిరించి మరి అతడిని పెళ్లి చేసుకుంది. మొదట వీరి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.. కానీ శోభ పెళ్లైన రెండేళ్లకే 1980లో సూసైడ్ చేసుకొని చనిపోయింది.

శరణ్య: ఈమె ప్రేమ కథ చాలా బోల్డుగా సాగిందని చెప్పవచ్చు. ఈమె డైరెక్టర్ పొన్ననన్ ను 1995లో తన ఫ్యామిలీకి ఇష్టం లేకుండా వివాహం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news