భారత్ లో పులులు రోజురోజుకు అంతరించి పోతున్నాయి. ఓవైపు అనారోగ్య కారణాలతో అర్ధాంతరంగా మృత్యువాత పడుతోంటే.. మరోవైపు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఓ పులిని వాహనం ఢీ కొట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని గోండియా జిల్లా నవేగావ్-నాగ్జీరా కారిడార్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తీవ్రంగా గాయపడటంతో పులి కాసేపు రోడ్డుపైనే కూర్చుండిపోయింది. అక్కడే ఉంటే మళ్లీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని అది శరీరం సహకరించపోయినా కాళ్లను ఈడ్చుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలను కొందరు వాహనదారులు చిత్రీకరించారు. ఆ వీడియోను ట్విటర్లో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. కాగా.. పులి దీన స్థితిని చూసి పలువురు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దెబ్బతిన్న పులి వయసు రెండేళ్లు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.
Dear friends Wildlife has first right of way in #wildlife habitats. So always travel safely & slowly. This tiger hit by vehicle at Nagzira. Via @vijaypTOI pic.twitter.com/fpx6zlKQDI
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 11, 2023