జపాన్‌ను గురి పెట్టిన లాన్‌ టైఫూన్‌.. అల్లకల్లోలమే

-

జపాన్‌ దేశాన్ని లాన్‌ టైఫూన్‌ టార్గెట్‌ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఇది టైఫూన్ల సీజన్. అయితే.. ప్రచండ గాలులు, కుంభవృష్టిని వెంటేసుకుని వచ్చే ఈ టైఫూన్లు తాము పయనించే మార్గంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. తాజాగా ఈ సీజన్ లో ఏడో టైఫూన్ దూసుకువస్తోంది. ఈ టైఫూన్ పేరు లాన్… ఇది జపాన్ కు గురిపెట్టింది.

Tropical Cyclone Ian

ఇది మధ్య జపాన్ భూభాగంపైకి ప్రవేశించే అవకాశాలున్నాయని, గంటకు 195 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతారణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని, జపాన్ పై మంగళవారం నుంచి దీని ప్రభావం ఉంటుందని జేఎంఏ తెలిపింది.

ప్రధానంగా ఒసాకా, క్యోటో నగరాల మీదుగా ఈ టైఫూన్ పయనించే అవకాశాలున్నట్టు తెలిపింది. భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.

శక్తిమంతమైన టైఫూన్ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. తుపాను ప్రభావం చూపించే ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కూడా రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news