తెలంగాణలో రైతులకు భారీ గుడ్‌ న్యూస్‌.. నిధులు విడుదల

-

రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్‌ చెప్పంది. రూ.లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు.. అందుకు అవసరమ్యే నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ.. ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ రాష్ట్ర రైతాంగానికి మరో తీపికబురు అందించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

TRS to oppose farm bills in Rajya Sabha,' announces KCR citing 'injustice'  to farmers

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను.. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రైతు రుణ మాఫీ పథకాన్ని ఆచరణలో పెట్టారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈమేరకు ఈ రోజు 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు.

 

దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 10,79,721 మంది రైతులకు సంబంధించి 6,546.05 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే.

ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news