తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రగతి భవన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ… తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈనెల 19వ తేదీన ఉన్న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా పడింది.
19వ తేదీన జరుప తలపెట్టిన సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా,ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18 మరియు 19 తేదీలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీచేసింది వాతావరణ శాఖ.