గత కొద్ది రోజుల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 77వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజుపై ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పీఎం ఇ-బస్ సేవకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
పీఎం ఇ-బస్ సేవకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలపడంతో పాటు 57వేల కోట్ల మొబిలిటి ఫండ్ ను కూడా కేటాయించింది. 100 నగరాలు, పట్టణాలకు 10వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. అదేవిధంగా విశ్వకర్మ యోజన పథకానికి రూ.13వేల కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ పథకం కింద చేతి వృత్తుల కళాకారులకు, మత్య్సకారులకు, తాపి పని చేసే వారికి ఆర్థికంగా చేయూతను అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా రూ.1లక్ష వరకు రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనిపై గరిష్టంగా 5 శాతం వడ్డీని విధించనున్నారు. విశ్వకర్మ యోజన పథకం వల్ల దేశంలో 30 లక్షల మంది చేతి వృత్తుల కళాకారులకు లబ్ది చేకూరనుంది.