జీ తెలుగు అందిస్తోన్న సరికొత్త సీరియల్ జగద్ధాత్రి, ఆగస్ట్ 21న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు!

-

హైదరాబాద్, 18 ఆగస్ట్, 2023: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్తో, భిన్నమైన సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. కొత్తదనం నిండిన కామెడీ, డాన్స్, సింగింగ్ షోలు, ఆసక్తికర మలుపులతో సాగుతున్న సీరియల్స్తో టెలివిజన్ రంగంలో దూసుకుపోతోంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ‘జగద్ధాత్రి’ అంటూ మరో కొత్త సీరియల్తో మీ ముందుకు రాబోతోంది. దీప్తి మన్నె – దర్శ్ చంద్రప్ప ప్రధాన పాత్రలలో నటించిన ‘జగద్ధాత్రి’ ఈ నెల 21 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం కానుంది.
‘జగద్ధాత్రి’ అనే ప్రధాన పాత్ర, మహిళా సీక్రెట్ ఏజెంట్ చుట్టూ ముడిపడిన పరిస్థితులే ఈ సీరియల్ కథ. ఈ సీరియల్ అసాధారణమైన కథాంశంతో ఊహించని మలుపులతో ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది.

జగద్ధాత్రి (దీప్తి మన్నె) తన మిత్రుడు కేదార్ (దర్శ్ చంద్రప్ప) తో కలిసి సీక్రెట్ ఏజెంట్స్ గా పనిచేస్తారు. కుటుంబంలో పెద్ద కుమార్తెగా, బాధ్యతల మధ్య సమతుల్యతను కలిగి ఉన్న జగద్ధాత్రి ప్రయాణమే ఈ కథ. దివ్యాంగుల పాఠశాలను నిర్వహిస్తూ ఓ స్త్రీగా సమాజంలో ఆటుపోటులను సమర్థంగా ఎదుర్కొంటూనే అన్యాయం, అక్రమాలను వ్యతిరేకించే సమయంలో అపరకాళిలా తన విశ్వరూపం చూపిస్తుంది జగద్ధాత్రి. రాధమ్మ కూతురుగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దీప్తి మన్నె, నూతన నటుడు దర్శ్ చంద్రప్ప ఈ సీరియల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రీతీ శ్రీనివాస్ కీలక పాత్రలో కనపడనున్నారు.

ఈ ప్రయాణంలో ఏ తప్పూ చేయని తన తల్లి చావుకి గల కారణాలను వెలికితీస్తుంది. జగద్ధాత్రి, కేదార్ సీక్రెట్ ఏజెంట్లుగా పనిచేస్తూనే సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. జగద్దాత్రి, కేదార్ మధ్య ప్రేమ చిగురిస్తుందా? జగద్దాత్రి కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమతుల్యం చేస్తుంది? జగద్ధాత్రి సీక్రెట్ ఏజెంట్ అనే రహస్యం ఎలా బయటపడుతుంది? తెలుసుకోవాలంటే ఈ సోమవారం నుంచి జీ తెలుగులో ప్రారంభం కానున్న జగద్ధాత్రి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే! ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసిన జగద్ధాత్రి గీతానికి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ గీతానికి కమ్రాన్ సంగీతం అందించగా లక్ష్మీ మేఘన పాడారు.

ఈ సీరియల్ ప్రారంభం సందర్భంగా ఆగస్టు 17న ఘనంగా జరిగిన మీడియా సమావేశంలో నటీనటులు దీప్తి మన్నె, దర్శ్ చంద్రప్ప, ప్రీతీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాన నటీనటులు ఈ సీరియల్లో వారు పోషిస్తున్న పాత్రలు, అనుభవాలను పంచుకున్నారు. వెండితెరపై తమ ఫైట్స్తో ప్రేక్షకులను అలరించిన రామ్‌‌-లక్ష్మణ్ మాస్టర్స్ మొదటిసారిగా టెలివిజన్లో ఈ సీరియల్కోసం పనిచేశారు. మీడియా సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ సీరియల్ గురించి నటి దీప్తి మన్నె మాట్లాడుతూ, ” జగద్ధాత్రిగా మీ ముందుకు రావాడానికి నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ కథ విన్నప్పుడు ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్లో నన్ను నేను ఊహించుకుని చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఇదొక ఒక సీక్రెట్ ఏజెంట్ కథ మాత్రమే కాదు, ఒక మహిళ తన గతం, తన కుటుంబం, తన వృత్తిని సమన్వయం చేసుకుంటూ జీవిస్తూనే అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించే అద్భుతమైన కథ. ఇలాంటి పాత్రలో మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

ఈ సీరియల్ కథ, ప్రత్యేకత గురించి జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – అనురాధ గూడూరు మాట్లాడుతూ, “జగద్దాత్రి ఒక సీరియల్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ! ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేసే కంటెంట్ను జీ తెలుగు అందిస్తోంది. మహిలలు తమ ఎలాంటి బాధ్యతలైనా ఎలా స్వీకరిస్తారు, కర్తవ్యసాధన కోసం ఎలా పోరాడుతారు అనే అంశం ఆధారంగా రూపొందిన ‘జగద్ధాత్రి’ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. సమాజంలో ఆదర్శవంతమైన మహిళగా జీవిస్తూనే సత్యాన్వేషణ సాగిస్తూ న్యాయంకోసం పాటుపడే ఓ శక్తివంతమైన మహిళ కథగా ఈ సీరియల్ మీ ముందుకు రానుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే సున్నితమైన అంశాలను స్పృశిస్తూ, భావోద్వేగాల సమ్మేళనంగా సాగే ఓ చక్కని కథ జగద్ధాత్రి. ఇలాంటి అద్భుతమైన కథను ప్రతి విషయంలోనూ ఉన్నతంగా మలిచేందుకు నటీనటులు, నిర్మాణ, దర్శకబృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతున్నారు. మా ప్రతి సీరియల్ని ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయాపూర్వక ధన్యవాదాలు. ఎప్పటిలానే ఈ సీరియల్ని కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

కుటుంబం మరియు వృత్తిని సమన్వయం చేసుకుంటూ సాగే ఓ సీక్రెట్ ఏజెంట్ కథ జగద్ధాత్రి, సోమవారం – శనివారం వరకు ప్రతిరోజు 7:30 గంటలకు తప్పక చూడండి, మీ జీ తెలుగులో మాత్రమే

Read more RELATED
Recommended to you

Latest news