ఆయుర్వేదం : ఇంట్లో ఇలా పెయిన్‌ బామ్ చేసుకుంటే ఎలాంటి నొప్పి అయినా మాయం..

-

వయసు పెరిగే కొద్ది మోకాళ్ల నొప్పులు, తలనొప్పి ఎక్కవైపోతాయి. వాటికి ఎన్ని మందులు వాడినా పైపైన మెరుగులు తప్ప ఏం ప్రయోజనం ఉండదు. తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి ఉన్నప్పుడు వెంటనే మనం చేసే పని ఏదైనా నొప్పి నివారణ బామ్ ఉపయోగిస్తాం. నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ పెయిన్ రిలీఫ్ క్రీమ్ రాయడం లేదా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవడం చేస్తాము. ఆయుర్వేదం ప్రకారం..కొన్ని సహజమైన పదార్థాలను ఉపయోగించి మీకు మీరుగా ఒక నొప్పి నివారణ లేహ్యంను తయారు చేసుకోవచ్చు. పైగా ఇది మార్కెట్‌లో తీసుకున్నవాటి కంటే కూడా బాగా పనిచేస్తుంది.

కావలసినవి:

సహజ బీస్ వాక్స్ 4 టీస్పూన్లు
కొబ్బరినూనె 4 టీస్పూన్లు
యూకలిప్టస్ ఆయిల్ 5 డ్రాప్స్
పుదీనా నూనె 5 చుక్కల
ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ 5 చుక్కలు
లావెండర్ ఆయిల్ 5 చుక్కల

తయారీ విధానం

ముందుగా ఒక గాజు గిన్నెలో బీస్ వాక్స్, కొబ్బరి నూనె వేసి మైక్రోవేవ్‌లో/ గ్యాస్ స్టవ్ మీద వేడి చేయండి. వేడికి కరిగిన మిశ్రమానికి పైన పేర్కొన్న అన్ని నూనెలను బాగా కలపండి. ఆపై ఈ మిశ్రమాన్ని ఒక గాజు కూజాలో పెట్టండి. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. చల్లబడ్డాక గడ్డ కడుతుంది. అంతే మీ కొబ్బరినూనె పెయిన్ కిల్లర్ బామ్ రెడీ. ఈ బామ్ ఉపయోగించే ముందు మీ చర్మంపై త్వరిత పాచ్ పరీక్ష చేసుకోండి, బాగుందనిపిస్తే ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీకు తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు ఈ బామ్‌లో నుంచి చిన్న మొత్తాన్ని తీసుకొని, మీకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. అంతే ఎలాంటి నొప్పి అయినా ఇట్టే తీసినట్లు పోతుంది. చేయడానికి కాస్త శ్రమ ఉంటుంది కానీ.. ఫలితం మాత్రం బాగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news