ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి నేతలు సీఎం జగన్ బూట్లు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, కొడాలి నాని, వల్లభనేని వంశీలపై నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై స్పందించిన దేవినేని.. జగన్ పై విమర్శలు చేశారు. తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తికి, బాబాయ్ ని హత్య చేయించిన వాడికి పరువు ఉంటుందా..? అని ప్రశ్నించారు. వైసిపి నేతల ప్రతి బూతు మాటకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.