ప్రభాస్ తో సమంత సినిమా చేయకపోవడానికి కారణం అదేనా..?

-

తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. సమంత టాలీవుడ్ లో ఉండే ఎంతోమంది హీరోల సరసన నటించిన కేవలం ఒక ప్రభాస్ సరసన మాత్రం నటించలేదు. పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలాంటి హీరోతో సినిమాలు చేయాలని ఎంతోమంది హీరోలు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సమంత మాత్రం ఇప్పటివరకు ప్రభాస్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

సమంత తో ప్రభాస్ సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటా అంటు పలువురు అభిమానులు ఆరా తీయగా . సమంత, ప్రభాస్ కాంబినేషన్లో ఇప్పటికే సినిమా రాకపోవడానికి కారణం వారు ఉన్నటువంటి హైట్ డిఫరెన్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ హైట్ 6.2 అంగుళాలు ఎత్తు ఉండగా సమంత 5.2 ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరి మధ్య భారీ ఎత్తు తేడా ఉండడంతో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడడానికి అభిమానులకు చాలా ఇబ్బందిగా ఉంటుందట.

అందుచేతనే వీరిద్దరి మధ్య ఎత్తు వ్యత్యాసాలు రావడంతో ప్రభాస్ ,సమంత కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత, ప్రభాస్ ఇద్దరు కూడా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు.. సమంత మయోసైటీస్ వ్యాధి చికిత్స కోసం ఇటీవలే విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.. విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది..ప్రభాస్ నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది..

Read more RELATED
Recommended to you

Latest news