ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్మణ్, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జీ తరుణ్ చుగ్ హాజరయ్యారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు భరోసా ఇవ్వడానికి ఖమ్మంలో ఈ సభ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
రైతుల పంట కొంటానని చెప్పిన కేసీఆర్.. ఎందుకు కొనడం లేదన్నారు. ఒక ట్రాక్టర్ లో ధాన్యాన్ని తీసుకెళ్తే నాలుగు ఐదు రోజులు అక్కడే కాపు కాసి ఎదురుచూడాల్సిన పరిస్థితి.. తెలంగాణలో భూములు అమ్ముకొని రైతుల రుణమాఫీ చేశారు. భారతీయ పార్టీకి అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యాన్ని తప్పకుండా కొంటుంది అని పేర్కొన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ మాయ మాటలను ఎవ్వరూ నమ్మరని.. బీజేపీ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.