Breaking: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

-

రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థ‌కున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.

TSRTC: TSRTC's key decision.. 3 thousand special buses for Rakhi full moon

ఈ నెల 31న పండుగ కాగా, ఈ నెల 29 నుంచి 31 వరకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌ డిపోల నుంచి హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌ వరకు 217, అలాగే 31 తేదీ నుంచి 4వ తేదీ వరకు జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌ వరకు 181 బస్సులు నడిపించనున్నారు. అయితే, ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news