“ఆదిపురుష్” కు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎన్నో అంచనాలు పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవడంలో విఫలం అయింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో నటించిన బాలీవుడ్ భామ కృతిసనన్ తాజాగా తనకు జరిగిన ఒక బాధాకరమైన ఘటన గురించి ఒక ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. కృతిసనన్ ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ఒక కొరియోగ్రాఫర్ ఆమెతో కొంచెం దురుసుగా ప్రవర్తించారని ఇంటర్వ్యూలో చెప్పింది. అప్పుడు ఈమె హీరోయిన్ కాకముందు మోడలింగ్ లో అడుగుపెడుతున్న సమయంలో జరిగిన సంఘటనగా ఈమె చెప్పుకొచ్చింది. మోడలింగ్ చేస్తున్నప్పుడు హై హీల్స్ వేసుకుని నడిచినందుకు కొరియోగ్రాఫర్ కృతి సనన్ ను అరిచాడట. అప్పుడు నాకు కంట్లో నీళ్లు ఆగలేదని.. చాలా సేపు ఈ విషయాన్నీ తలుచుకుంటూ బాధపడ్డానని ఎవ్వరికీ తెలియని ఈ విషయాన్నీ కృతి ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఆ తర్వాత ఈమె హీరోయిన్ అవ్వడం తెలుగులో మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో నేనొక్కడినే మూవీ లో చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడంతో వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది.