“జమిలి” ఎన్నికల ప్రస్తావన అందుకే ?: మంత్రి హరీష్ రావు

-

ఇప్పుడు దేశం అంతటా ఒకే మాట వినిపిస్తోంది. సంవత్సరంలో జరిగే పార్లమెంట్ సమావేశాలు కాకుండా అదనంగా 5 రోజుల సమావేశాలు నిర్వహించి, వీటి ద్వారా కొన్ని ముఖ్యమైన బిల్లులను తీసుకురావాలన్నది మోదీ మాస్టర్ ప్లాన్. అందులో భాగంగానే జమిలీ ఎన్నికలకు కూడా ఒక బిల్లును తీసుకువస్తారు. అందుకోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని సైతం నిర్వహించి “వన్ నేషన్ – వన్ ఎలక్షన్” పై అభిప్రాయాలను సేకరించి ఫైనల్ చేయాలన్నారు. ఇప్పుడు ఈ విషయంపై అందరూ తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ముందే తెలిసిపోయి, ఇప్పుడు బీజేపీ జమిలి ఎన్నికల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఇక జమిలీ ఎన్నికల కమిటీలో సౌత్ ఇండియా కు ఎందుకు ఆవకాశం ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ఇక బీజేపీ ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ ఓడిపోవడం పక్కా అంటూ హరీష్ రావు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news