ప్రస్తుతం చర్చనీయాంశమయిన ఇండియా పేరు మార్పు అంశంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఇండియానా జోన్స్ మూవీ పోస్టర్ను ట్విటర్ (X) లో షేర్ చేశారు. ఈ మూవీ పేరులో ఇండియా ఉండటంతో.. ఇక నుంచి ఈ సినిమాను భారత్న్నా జోన్స్ అని పిలవాలా? అనే ఉద్దేశంలో ఫన్నీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
ఇండియానా జోన్స్’ చిత్రాలలో మొదటి భాగం 1981లో ‘ఇండియానా జోన్స్ అండ్ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ పేరుతో రాగా.. తర్వాత 1984 లో ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్ , 1989లో లాస్ట్ క్రూసేడ్ , 2008లో కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ చిత్రాలు వచ్చాయి. కాగా.. దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ నాలుగు సినిమాలు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.