తెలంగాణలో రాజకీయాల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈయన బిఆర్‌ఎస్ లో ఉంటారా? లేక కాంగ్రెస్ లోకి వెళ్తారా? అనేది క్లారిటీ రాలేదు. అయితే కేసిఆర్..ఈయనకు మల్కాజిగిరి సీటు ఇచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే మైనంపల్లి తన తనయుడుకు మెదక్ అసెంబ్లీ సీటు కూడా డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే తన తనయుడుని సైడ్ చేయడానికి మంత్రి హరీష్ రావు రాజకీయం చేశారని, మెదక్ పై ఆయన పెత్తనం చేస్తున్నారని, ఇంకా హరీష్‌ని టార్గెట్ చేసి మైనంపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలు బిఆర్‌ఎస్ లో పెద్ద ఎత్తున రచ్చ లేపాయి. ఇక మైనంపల్లికి అప్పటికే సీటు కేటాయించారు. దీంతో మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి..సీటు క్యాన్సిల్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కేసిఆర్ ఇంతవరకు ఆ పని చేయలేదు. మరి ఎందుకు మైనంపల్లిని సస్పెండ్ చేయకుండా వదిలారో క్లారిటీ లేదు. అంటే రాజకీయంగా బలమైన నేత అని మైనంపల్లిని సస్పెండ్ చేయలేదా? అనే టాపిక్ నడుస్తోంది.
ఇదే సమయంలో మైనంపల్లి తన తనయుడుతో కలిసి ఈ నెల 17న సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో మైనంపల్లి పార్టీ మారకుండా బిఆర్‌ఎస్ అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. అయితే మైనంపల్లి మాత్రం..కేసిఆర్ తో మాట్లాడించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
అప్పుడే పార్టీ మార్పుపై నిర్ణయం వెనక్కి తీసుకుంటానని చెబుతున్నట్లు తెలిసింది. లేదంటే మైనంపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి మైనంపల్లి కారులోనే ఉంటారా? లేక కాంగ్రెస్ లో చేరతారో.