చంద్రబాబు చేయని ఆరాచకాలు లేవు : విజయసాయిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ ఏపీలో సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో.. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ సమస్యలు గుర్తించి సరిదిద్దుతామన్నారు. జిల్లాలో సమస్యలు పరిష్కరించే బాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డి చూసుకుంటారన్నారు విజయసాయిరెడ్డి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారని, నిన్న టీడీపీ బంద్ లో చంద్రబాబు సొంత కంపనీ హెరిటేజ్ కూడా స్పందించి మూయలేదన్నారు.

Vijayasai Reddy removed from Rajya Sabha panel of vice-chairmen, a day  after re-nomination

అంతేకాకుండా.. ‘చంద్రబాబు ఆయన మహానాయకుడు అని నమ్మించే ప్రయత్నం చేసే మీడియా కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.. విద్యార్థి దశ నుంచే నేర పూరిత ఆలోచనలు చేసే చంద్రబాబు.. ఆయన సొంత మీడియా ఆయన విజనరీ ఉన్న నేత అని చేసిన ప్రచారం డొల్ల అని తేలింది.. సీమెన్స్ కంపెనీ పెట్టుబడుల్లో లోకేష్ ముఖ్య అనుచరుడు కిలారి రాజేష్ ది ప్రముఖ పాత్ర.. రాష్ట్రంలో రాజకీయాలు బ్రష్టు పట్టించిన చంద్రబాబు.. ఆయన ఓటుకు నోటు రాజకీయాలు అందరికీ తెలుసు.. స్వతహాగా కరిష్మా లేని నేత చంద్రబాబు.. కనీస నాయకత్వ లక్షణాలు లేవు.. ఆయన చేయని ఆరాచకాలు లేవు.. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఆయన ఇన్ సైడ్ ట్రేడింగ్ అందరికీ తెలుసు.. జ్యుడీషియల్ వ్యవస్థలో కూడా తన సొంత సామాజిక వర్గ నేతలతో స్టేలు తెప్పించుకునే నేత చంద్రబాబు.. 14 ఏళ్ల సీఎంగా ఆయన చేసిన ప్రతీ పనీ ఓ స్కామే..

చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్.. చంద్రబాబు అరెస్ట్ లోకేష్, ఎల్లో మీడియాకు మింగుడు పడని అంశం.. లోకేష్ కు దైర్యం ఉంటే చంద్ర బాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్టే వెకేట్ చేయించాలి.. 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారు.. డబ్బులో ఒక్క రూపాయి కూడా రాలేదని సిమెన్స్ సంస్థ స్పష్టం చేసింది.. కుంభకోణం చేసింది మొత్తం చంద్రబాబని ఈడీ కూడా బయట పెట్టింది..’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news