Breaking : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్

-

ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపావాస దీక్ష చేస్తోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తాను రేపు (గురువారం) ఉదయం వరకు దీక్ష చేస్తానని ఆయన చెప్పగా, పోలీసులు మాత్రం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఉందని చెబుతూ ఆయన దీక్షను భగ్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తన దీక్ష కొనసాగుతుందన్నారు. శాంతియుత దీక్ష వల్ల పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. మన ఉద్యోగాలు మనకే అని చెబుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటికీ వాటిని నెరవేర్చలేకపోయారని తెలిపారు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారని… మొత్తం 1200 మంది విద్యార్థులు బలిదానం చేశారని గుర్తు చేశారు. కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తూ… సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలపై పోరాడితే బండి సంజయ్ పై కేసులు పెట్టడం దారుణం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పేపర్ల లీకేజీలు జరిగాయన్నారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news