Kalvakuntla kavitha : సిడబ్ల్యుసి సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. ‘రాజకీయ టూరిస్టులకు స్వాగతం. హైదరాబాద్ బిర్యాని తిని సంతోషంగా వెళ్లండి కానీ… ప్రజలను మరోసారి మభ్య పెట్టవద్దు. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వైఖరి అవలంబిస్తోంది. 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదు’ అని కవిత ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య అవగాహనేమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తుశుద్ధి లేదంటూ విమర్శించారు. ఇరవై ఏళ్లుగా పెండింగులో ఉన్న మహిళ రిజర్వేషన్ల బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు ముందే అమరులకు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణకు ఎందుకు వస్తున్నారో చెప్పాలన్నారు కల్వకుంట్ల కవిత.