పాలమూరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాం: కేసీఆర్

-

గతంలో సీఎంలు పాలమూరును దత్తత తీసుకున్నా న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో పుట్టిన నేతలే ఈ ప్రాజెక్టును అడ్డుకున్నారని విమర్శించారు. ఈ అడ్డంకులను అధిగమించి ఇవాళ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని తెలిపారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు తన మనస్సు ఎంత ఆనందపడిందో.. ఇవాళ పాలమూరు పొంగు చూసినప్పుడు అంతే సంతోషం కలిగిందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

CM KCR warns against India being turned into Taliban-ruled  Afghanistan-Telangana Today

నేను ఒక్క మాట అడుతుతున్న బీజేపీ బిడ్డలను. మీకు సిగ్గూ శరం, చీమునెత్తురు, పౌరుషం ఉంటే.. పెద్ద సిపాయి పార్టీ అని మాట్లాడుతరు. పాలమూరుకు, తెలంగాణకు నీళ్ల గురించి కేంద్రాన్ని అడిగాం. కృష్ణా నదిలో వాటాతేల్చమని ప్రధాని మోదీని కోరాం. ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని, మా అంత సిపాయిలు అనే బీజేపీ, ఇక్కడ పెద్ద పెద్ద పోజులు కొట్టే నాయకులు మహబూబ్‌నగర్‌లో ఉన్నరు. వాటా తేల్చేందుకు పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్‌కు రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని లేఖ రాయించాలి. దానికి మోదీ కుయ్‌మనడు కైమనడు.

ఇక్కడ సిగ్గులేని వీల్లు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నరు. మీకు బుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కృష్ణా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయించాలి. మా వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. కేంద్రం పిలిపించి సుప్రీకోర్టు కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. ఏడాది అయినా అతీగతి లేదు. సిగ్గులేని బీజేపీ నాయకులు మేం జాతీయ ఉపాధ్యక్షులమంటూ అడ్డంపొడువు మాట్లాడుతున్నరు. ప్రజలు వారిని నిలదీయాలి. పాలమూరులో జరిగిన నష్టం చాలు. ఎవరైనా బీజేపీ నాయకులు జెండాలు పట్టుకొని వస్తే నిలదీయాలి. పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడం లేదు’ అంటూ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news