తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్. తెలంగాణలో 6603 నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్షుల పోస్టులను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించేందుకు ఆదేశించింది.
ఇవిగాక మరో 3065 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముందు ముందు క్రమబద్దికరించే కార్యదర్శులను వాటిల్లో నియమించేందుకు వెసులుబాటు కల్పించింది. జెపిఎస్ లకు నెలకు రూ. 28,719 వేతనం వస్తుండగా… నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులను వేతన స్కేల్ ను రూ.24280-72850 వర్తింపజేయనుంది. రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్ లు పనిచేస్తుండగా….వారిని క్రమబద్ధీకరించి నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నాలుగేళ్ల సర్వీసు, పనితీరు ప్రాతిపాదికపై అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇక కేసీఆర్ సర్కార్ ప్రకటన తరుణంలో… తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.